మందు పాత్ర ప్రేలుడు లో మృతుల కుటుంబాలను ఓదార్చిన ముఖ్యమంత్రి

న్యూస్ తెలుగు/చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కుట్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మావోయిస్టులు మందుపెట్టి 8 మంది డి ఆర్ జి జవాన్లను, ఒక డ్రైవర్ ను హత మార్చిన సంగతి పాఠకులకు విధితమే. మంగళవారం చతిస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ శర్మ, మంత్రి కేదార్ కశ్యప్ జిల్లా కేంద్ర మైన దంతివాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ చేరుకొని అమరులైన జవాన్లకు తొలుత శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాలను బుజం తట్టి ఓదార్చారు. జవాన్ల అంతిమ యాత్రకు ముందు పార్థివ దేహం గల బాక్స్ ను భుజాన ఎత్తు కున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా విషాదంగా నెలకొంది. (Story : మందు పాత్ర ప్రేలుడు లో మృతుల కుటుంబాలను ఓదార్చిన ముఖ్యమంత్రి)