Homeవార్తలుతెలంగాణసిపిఐ పటిష్టత తో కష్టజీవుల బతుకులు బాగు

సిపిఐ పటిష్టత తో కష్టజీవుల బతుకులు బాగు

సిపిఐ పటిష్టత తో కష్టజీవుల బతుకులు బాగు

సిపిఐ నేతలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : సిపిఐ పటిష్టతతోనే కష్టజీవుల బతుకులు బాగుపడతాయని, పార్టీలో చేరాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జె.రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఐ వనపర్తి పట్టణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పానగల్ మండలం కేతేపల్లికి చెందిన 94 ఏళ్ల సిపిఐ వృద్ధనేత పి.కిష్టయ్య భగత్ సింగ్ నగర్ లో ప్రారంభించారు. జయమ్మకు పార్టీ సభ్యత్వం అందించి రుసుము సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి జె రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్ళు అవుతుందన్నారు. అధికారంలోకి రాకపోయినా ప్రజల పక్షాన ఎర్రజెండా పోరాటం వల్లే సజీవంగా ఉందన్నారు. రైతులకు రుణమాఫీ, పేదలకు భూముల పంపిణీ, నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఆసరా పింఛన్లు రేషన్ కార్డులు సిపిఐ పోరాట ఫలితంగానే లభించాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కోసం పోరాడుతోందన్నారు. సిపిఐ పోరాటంతోనే కూలీలకు ఉపాధి హామీ పథకం తెచ్చారన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన కొన్ని పోయినట్లు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తేలిందని, సర్వేలో వారిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కోసం ఢిల్లీలో పంజాబ్ రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు. కార్మికులు కర్షకులు కూలీలు, ఉద్యోగులు మహిళలు సిపిఐ సభ్యత్వం స్వీకరించి సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు.వృద్ధ నేత కిష్టయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, నాయకులు లక్ష్మీనారాయణ, చిన్న కురుమన్న, జయమ్మ, శిరీష, జ్యోతి, రవి తదితరులు పాల్గొన్నారు. (Story : సిపిఐ పటిష్టత తో కష్టజీవుల బతుకులు బాగు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics