UA-35385725-1 UA-35385725-1

భూమిలేని నిరుపేదలకు రూ. 12వేల ఆర్థిక చేయుత

భూమిలేని నిరుపేదలకు రూ. 12వేల ఆర్థిక చేయుత

న్యూస్‌తెలుగు/వనపర్తి : అన్నదాతల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రైతులకు అన్ని విధాలుగా లబ్ధిచేకురుస్తున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం
రైతు భరోసాను రూ 12 వేలకుపెంచిందన్నారు.
గత ప్రభుత్వం కేవలం రూ.10 వేలు రైతు బంధు ఇచ్చిందని అంతకంటే ఎక్కువగా రైతు భరోసా పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతులందరికీ పెట్టుబడి సాయం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి షరతుల్లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ప్రతీ ఎకరానికి రైతు భరోసా చెల్లింపు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం చెల్లించినట్లుగా రాళ్లు రప్పలు, రోడ్లు రహదారులకు, రియల్​ ఎస్టేట్​ వెంచర్లకు రైతు భరోసా నిలిపివేయడంతో నిజమైన రైతన్నలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఈ అనర్హులను గుర్తించి తొలగించే ప్రక్రియను ప్రత్యేక అధికారుల బృందం చేపడుతుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతాయని ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల ను పురస్కరించుకుని అదే రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టిందని
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆర్థికంగా అదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సహాయం అందజేయున్నట్లు ఆయన పేర్కొన్నారు. (Story : భూమిలేని నిరుపేదలకు రూ. 12వేల ఆర్థిక చేయుత)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1