తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి డి శ్యామ్
న్యూస్ తెలుగు/ విజయనగరం : ఆదివారం స్థానిక ఎన్జీవో భవన్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ జిల్లా శాఖ వార్షిక కౌన్సిల్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జోగారావు, ప్రధాన కార్యదర్శి సూరిబాబు ఆధ్వర్యం లో జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు గా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.ఐతే సంఘ నిబంధనలకి విరుద్ధంగా ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి డి. శ్యామ్(నాపై) పై వారు అవిశ్వాసం పెట్టి తొలగించి, మత్తంశెట్టి మురళిని ఎంపిక కోసం జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ప్రయత్నం చేసినప్పటికీ, రాష్ట్ర పరిశీలకు ఈ ప్రతిపాన నిబంధనలకు విరుద్ధమని వారు ఆమోదించలేదు,అలాగే ఈ కౌన్సిల్ సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది.అయినప్పటికీ ఆ ప్రతిపాదన ఆమోదం పొందినట్టుగా తప్పుడు ప్రచారంతో దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. (Story : తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను)