పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా
సాగు భూములకే సాయం పట్ల సంతోషం
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని వ్యవసాయాన్ని పండుగ చేయాలని ఉద్దేశంతో నిన్న సాయంత్రం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసా పై కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు యాదయ్య ముదిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి సమద్ద్ గారు ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 26 నుండి అంటే రాజ్యాంగం జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు మూడు పథకాలను అమలులోకి తేవడం పట్ల చాలా సంతోషకరమని సాగుచేసిన భూములకే రైతు భరోసా కింద ఎకరాకు 12 వేలు చెల్లింపు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కుటుంబ రైతులందరికీ ఏడాదికి రూ 12 వేలు అందించడం అదేవిధంగా 10 ఏళ్లు ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజలు అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం చేయాని రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, పరిశ్రమల భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, వందల ఎకరాలను కబ్జా చేసిన నాయకుల భూములకు ఇచ్చి రైతు బంధు పేరుతో రూ 22 వేల కోట్లు ప్రజాధనాన్ని బీఆర్ఎస్ నాయకులు దుర్వినియోగం చేసి నిజమైన రైతులకు ఇవ్వకుండా అసాములైన పెద్ద పెద్ద రైతులకు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా తయారు చేసింది ని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వన్న ఎలాంటి షరతులు లేకుండా సాగు చేసి పంట పండించే ప్రతి రైతుకు అందే విధంగా పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం ప్రకటించి రైతు భరోసా ఇవ్వడం పట్ల చాలా సంతోషకరమైన విషయమని అలాగే పాలమూరు ముద్దుబిడ్డ అయినా దివంగత నేత ఎస్ జైపాల్ రెడ్డి గారి పేరుతో పాలమూరు ప్రాజెక్టుకు పేరు పెట్టడం చాలా సంతోషమని తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం పైన ప్రజల ఆశీస్సులు, దేవుని దివ్యనలు ఉండేలా ప్రార్థించాలని కోరారు. (Story : పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా)