Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి

హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి

0

హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి

హైందవ శంఖారావం సభకు వెళ్లిన భక్తులకు ఆహారం, నీరు పంపిణీ చేసిన జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ : హైందవ ధర్మపరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అది అందరి సమిష్టి బాధ్యత అని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందకోసం ఎవరు ఏ రూపంలో ప్రయత్నం చేసినా సంఘీభావం ప్రకటించడం, మద్దతుగా నిలవడం చేయాలని కోరారు. విజయవాడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంఖారావం సభకు హిందువులు పెద్దఎత్తున తరలివెళ్లారు. హైందవ శంఖారావం సభకు తరలివెళ్తున్న వారికి విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్ మెంట్ సొసైటీ, శ్రీ మహదేవ హిందూ ధర్మపరిరక్షణ సమితి, శ్రీ యోగా విద్య ప్రాణశక్తి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఆహారం, నీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. సభకు వెళ్తున్న హిందువులకు తేనీరు, బిస్కెట్లు, మజ్జిగ, పులిహోర, తాగునీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడిచిన అయిదేళ్లుగా రాష్ట్రంలో విపరీత పరిస్థితులు నెలకొన్నాయని, అవి ఇప్పుడిప్పుడు చక్కబడుతు న్నాయని అన్నారు. మన మతాన్ని ఆచరించడం, పరమతాన్ని గౌరవించడం అన్న స్పృహ పెరిగిన రోజు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. (Story : హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version