అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపుమేరకు వినుకొండ పట్టణంలో సోమవారం శివయ్య స్తూపం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ నిరసన కార్యక్రమం కేంద్ర హోం శాఖ మినిస్టర్ అమిత్ షా బి.ఆర్.అంబేద్కర్ ని అవమానించడం దుర్మార్గమని, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ నాయకులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి బిజెపి నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని, దీనికి నిరసనగా వినుకొండ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజనేయులు, షేక్ నాగూర్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు షేక్ ఫిరోజ్, భాస్కర్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, పిడుగు విజయకుమార్ , రమేష్, దుర్గాప్రసాద్, వందనం, తదితరులు పాల్గొన్నారు. (Story : అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన)