రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి వెంకట్ రామిరెడ్డి వసతి గృహం కాదు ఒక విశ్వవిద్యాలయం
న్యూస్ తెలుగు /వనపర్తి : రాజబహుదూర్ వెంకట్ రామిరెడ్డి హాస్టల్ పూర్వ విద్యార్థులు సమ్మేళం హైదరాబాద్ రెడ్డి హాస్టల్ (అబిడ్స్)నందు జరిగింది. ఇట్టి సమ్మేళనంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి ముందు చూపుతో ఆనాడే మహిళా విద్యార్థుల కోసం వసతి గృహం(ఉమెన్స్ హాస్టల్) ఏర్పాటు చేసి అన్ని రంగాలలో మహిళలు రాణించాలని వారి అభివృద్ధి కోసం కృషి చేశారని, 106 సంవత్సరాల క్రితం ఈ దేశాభివృద్ధినీ కొత్తపుంతలు తొక్కించాలని ముందుచూపుతో ఆలోచన చేసి మెరికల లాంటి విద్యార్థులను తయారు చేసి దేశానికి అందించిన చరిత్ర రెడ్డి హాస్టల్ కు వుందని దానికి ఆద్యుడు వెంకట్ రామిరెడ్డి అని కొనియాడారు.వస్తున్న నూతన సాంకేతిక సంస్థలతో పోటీపడి ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయ విధానాన్ని అందించి రాబోవు తరాల కోసం ఈ సంస్థ తోడ్పడాలని కాంక్షించారు.రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి ఒక సామాజిక వర్గాన్ని ప్రోత్సించకుండా ప్రతిభ ఉన్న ఇతర సాజిక విద్యార్థులను ప్రోత్సహించి వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు.(Story : రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి వెంకట్ రామిరెడ్డి వసతి గృహం కాదు ఒక విశ్వవిద్యాలయం )