Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆవిర్భావం దినోత్సవం

ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆవిర్భావం దినోత్సవం

0

ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆవిర్భావం దినోత్సవం

ఈ నెల 31 ని గ్రామ గ్రామాన విజయవంతం చేయండి 

ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90

చింతూరు (న్యూస్ తెలుగు )అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ : చింతూరు మండలం లో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఎర్రంపేట నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చింతూరు మండలం ప్రచార కార్యదర్శి పోడియం లక్ష్మణ్ మాట్లాడుతూ తమ సంఘం ఏర్పడి34 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్. సాధించిన విజయాలు . కిన్నెరసాని లో 1990 లో ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ నాలుగు లక్ష్యాలతో నిర్మాణం జరిగింది . (ఆదివాసీ సమాజపరిరక్షణ ,ఉపాధి కల్పన , ఏజెన్సీ ప్రాంత చట్టాల పరిరక్షణ ,భాషా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతంలో అన్ని కళాశాలలో సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్స్ సాధించింది . జీవో నెంబర్ 3ని సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ శాఖలలో 100 % ఆదివాసీలతో ఉద్యోగాల భర్తీ చేయించింది.గ్రామ వార్డు సచివాలయం ఉద్యాగాల భర్తీ అమలులో ,పీజీ హెచ్ యం.ప్రమోషన్ అమలు విషయంలో కీలక పాత్ర . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంత కళాశాలలో 6 శాతం గా వున్న సీట్లు రిజర్వేషన్ 100 % సీట్లు అమలు చేయించింది .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంత భూపరిరక్షణలో కీలక ఉద్యమాలు నిర్వహిచింది .పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు తరపున నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఆదివాసీ సంక్షేమ పరిషత్.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రాముఖ్యతను ఆదివాసీ సమాజంలోకి బలంగా తీసుకెళ్లిన ఘనత ఆదివాసి సంక్షేమ పరిషత్ తీసుకుంది.భాషా ప్రాముఖ్యత ఆధారంగా భాషా దినోత్సవంను ప్రభుత్వం నిర్వహించేలా ఉధ్యమిచ్చిందిఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు భాషా పరిరక్షణ ఉద్దేశంతో రేలా పండూమ్ ను 2013,2016. 2018,2019 2024 వరకు ఆదివాసిసంక్షేమ పరిషత్ లో భాగం చేసుకుంది . కోయ డిక్షనరీ అభివృద్ధి పెద్దన్న పాత్ర పోషించాము .యాష్( కోయ రోగం ) అని చెప్పిన ప్రభుత్వం ,ప్రభుత్వ అధికారుల పైన కేసు నమోదు చేసి కోయ రోగం పేరును తొలిగించిన సంఘం ..వేల మంది ఆదివాసీ విద్యార్థి నాయకులు వారి జీవితాలు త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నాం వాటిని గుర్తుచేస్తూ ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ 34 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిచుకొనుటకు ఆదివాసీ సమాజంపాల్గొని ఆదివాసీ సమాజ అభివృద్ధి కొరకు భవిషత్తు ఉద్యమాలలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్నవారు సీనియర్ నాయకులు పైద మత్తయ్య, బొక్కిలి కుమార్ మడకం సాయికుమార్, మడకం సత్యనారాయణ, మడకం బాలు తదితరులు పాల్గొన్నారు.(Story : ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆవిర్భావం దినోత్సవం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version