UA-35385725-1 UA-35385725-1

బ్రేకింగ్ న్యూస్ :నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు

బ్రేకింగ్ న్యూస్ :నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు

న్యూస్‌తెలుగు/సాలూరు : సొంత ప్రయోజనాల కోసం ఫేక్ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న వ్యక్తిని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ పోలీసులు అరెస్టు చేశారని పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ తెలిపారు. శనివారం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా బలివాడ సూర్య ప్రకాష్ s/o లేటు సత్యనారాయణ 41 విజయనగరం జిల్లా అంబటి వలస నివాసం ఉంటున్నాడు. ఈయన నకిలీ ఐపీఎస్ గా కారు మీద వచ్చి పార్కింగ్ స్థలంలో కారు ఆపి వ్యూ పాయింట్ వరకు వెళ్లి తిరిగి పార్కింగ్ స్థలం వరకు రావడం జరిగిందని తెలిపారు.. అక్కడ కొందరు పోలీసులతో ఫోటోలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత ఆయన తీసుకున్న ఫోటోలు వాట్సాప్ లో స్టేటస్ లో ఫోటోలు పెట్టడంతో ఎవరు ఈయన అని విచారణ చేయగా నకిలీ ఐపీఎస్ అని విచారంలో తేలిందని అన్నారు. ఈయన ను అరెస్టు చేసి క్రైమ్ నెంబర్ 165/2024 చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. నిందితుడు గజపతినగరం మండలం గడసాం గ్రామం నివాసిగా తేలిందని అన్నారు. ఈయన బీటెక్ , ఎంబీఏ చదివి 2003 నుండి 2005 వరకు ఆర్మీలో సిపాయిగా ఉద్యోగం చేశాడని అన్నారు. అనంతరం ఆ ఉద్యోగం వదిలి పారిపోయి వచ్చాడని ఆ. తర్వాత కొద్ది రోజులు లేబర్ కాంట్రాక్ట్ వర్కులు వేయింగ్ మిషన్ సర్వేయర్ గా పనిచేశాడని అన్నారు. ఆ టైం లో కొద్ది రోజులు నకిలీ ఇన్స్పెక్టర్ గా కూడా చలామణి అయ్యాడని అన్నారు. తర్వాత హైదరాబాదులో చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకుని ఉండేవాడని 2020 కరోనాలో వాళ్ల ఫాదర్ చనిపోవడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాదు నుంచి సొంత ఊరికి రావడం జరిగిందని అన్నారు. ఆ గ్రామంలో వాళ్ల నాన్న 9 ఎకరాలు వాళ్ల భూమి కొన్నట్లుగా కాగితాలు చూసి ఆ భూమి అమ్మిన వాళ్ల దగ్గరికి వెళ్లి నాకు తొమ్మిది ఎకరాల భూమిని నా పేర రిజిస్ట్రేషన్ చేయండి వాళ్లని బెదిరించేవాడని అన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఆఫీసు అయితే ఈ భూమి తిరిగి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చుననే దురుద్దేశంతో 2024 జనవరిలో హైదరాబాదులో హాస్టల్ లో ఉండి రెండు నెలల క్రితం తిరిగి జిల్లాకు రావడం జరిగిందని అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడే. ఈయన నకిలీ ఐడి కార్డులు, 2 సెల్ ఫోన్లు,2యూనిఫారాలు,నేమ్ ప్లేట్స్, బెల్ట్ లు తయారు చేసుకున్నాడని. ఒక కారు కొనుగోలు చేశారని అన్నారు. వీటన్నిటిని సీజన్ జరిగిందని ఆయన తెలిపారు.నిందితుడిని అరెస్టు చేసి, వైద్య పరీక్షలు నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన, అనంతరం కోర్టులో హాజరపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి అంకిత సురన, సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రామకృష్ణ, మక్కువ ఎస్ఐ వెంకటరమణ, సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1