గీతాంజలి స్కూల్స్ నందు మోటివేషనల్ ప్రోగ్రాం
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు ప్రముఖ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్ మరియు కెరీర్ కౌన్సిలర్ సుధీర్ సండ్ర చే 8,9,10 తరగతుల విద్యార్థులకు మోటివేషనల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర మాట్లాడుతూ. చిన్నారులు జీవితంలో ఎదగడం కొరకు మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని సాగాలని, తల్లిదండ్రులను,, ఉపాధ్యాయులను గౌరవిస్తూ బావి భారత పౌరులుగా తమను తాము నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని, చెడు స్నేహాలను ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనీయకుండా మంచి విద్యార్థులుగా తల్లిదండ్రుల పేరును, పాఠశాల పేరును, జన్మస్థల పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యలో రాణించి తమని తాము నిరూపించుకోవాలని కోరారు. తమకన్నా ఎక్కువ ప్రావీణ్యం కలిగినటువంటి విద్యార్థులతో పోటీ పడాలని కోరారు. అనంతరం చిన్నారులకు మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ వై శేషగిరిరావు, కరస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ప్రిన్సిపల్ టి కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి స్కూల్స్ నందు మోటివేషనల్ ప్రోగ్రాం )