ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం డిఏ ప్రకటించాలి
వీలైనంత త్వరగా నూతన పిఆర్సి కమిషన్ ను వేసి మధ్యంతర భృతిని ప్రకటించాలి
నోబుల్ టీచర్స్ అసోసియేషన్
న్యూస్ తెలుగు /వినుకొండ : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి హైమారావు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.వి నాగేశ్వరావు నేతృత్వంలో విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. తదనంతరం అసెంబ్లీ చీఫ్ విప్ మరియు వినుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ని కలిసి ఉద్యోగస్తులకు నూతన పిఆర్సి కమిషన్ను నియమింపజేసి, వెంటనే మధ్యంతర భృతి ప్రకటించేలా చూడాలని, వెంటనే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కు చర్యలు తీసుకోవాలని, పదో తరగతి చిన్నారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందరోజుల ప్రణాళికలోని లోపాలను సవరించాలని, నూతన సంవత్సర శుభవేళ ఉద్యోగస్తులకు ప్రభుత్వం డి .ఏ ప్రకటించాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన విన్నవించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన చీఫ్ విప్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి మాతంగి సాంబశివరావు, బెల్లంకొండ మండల కమిటీ కార్యదర్శి కూరపాటి రాజా, టి. ఎన్. ఏ రాష్ట్ర కార్యదర్శులు రాజ చౌదరి, సెల్వరాజ్, గుంటూరు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి విశ్వనాథ్, పి.లలిత బాబు, గుంటూరు నగర అదనపు కార్యదర్శి టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం డిఏ ప్రకటించాలి)