ముఖచిత్ర క్యాలెండర్ ను విడివిడిగా ఆవిష్కరించిన ఎంపీ మల్లు రవి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ ను విడివిడిగా ఆవిష్కరించిన ఎంపీ మల్లు రవి , ఎమ్మెల్యే మెగా రెడ్డి ,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఐక్యవేదిక నాయకులు హైదరాబాదులోని ఎంపీ ఆఫీస్ దగ్గర, ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసులో వనపర్తి ముఖచిత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎంపీ ఎమ్మెల్యే ఈ క్యాలెండర్ బాగుందని ఇలాగే వనపర్తి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఎమ్మెల్సీ మల్లన్న క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడుతూ చాలా గొప్ప క్యాలెండర్ ను రూపొందించిన సతీష్ యాదవ్ ను ఐక్యవేదిక సభ్యులను అభినందిస్తూ అలాగే వనపర్తి లో జరిగే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ త్వరలో వనపర్తికి వస్తానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్,తీన్మార్ మల్లన్న టీం వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్. బి ఎస్ పి టౌన్ ప్రజెంట్ గంధం భరత్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, నాయకులు బొడ్డుపల్లి సతీష్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. (Story : ముఖచిత్ర క్యాలెండర్ ను విడివిడిగా ఆవిష్కరించిన ఎంపీ మల్లు రవి)