రైతు సేవా కేంద్రం లో వడ్లు కొనుగోలు సేకరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మండల వ్యవసాయ అధికారి కె అంజిరెడ్డి సోమవారం పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కే అంజిరెడ్డి మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న 15 రైతు సేవా కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయటం జరుగుతుంది. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ A రకం 75 కేజీల వడ్లు బస్తా ధర 1740 రూపాయలు గ్రేడ్ B రకం 75 కేజీల బస్తా ధర 1725 రూపాయలు, తేమ శాతం 17% ఉండాలి. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయటం జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా తూఫాన్ మరియు అధిక వర్షాలు సమయం లో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. వినుకొండ నియోజకవర్గం వ్యవసాయ అధికారి కె అంజిరెడ్డి నరగాయపాలెం గ్రామములో వానకి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించటం జరిగింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను ముందుగా కోయరాదు. కోసిన పూర్తిగా ఆరనివ్వాలని, తూఫాన్ వాతావరణం నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఏకరకు 25 కేజీ ల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పలు వేసుకోటం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు. కోత కోసి పొలం లో ఉన్న పనలు వర్షం కి తడిస్తే గింజ మొలకెత్త కుండా ఉండటానికి 5% ఉప్పు ద్రావణం పనలపై పదేవిధముగా పిచికారి చేయాలి.ఒక వేళ పొలం లో నీరు నిలిచి ఉన్నట్టు అయతే పనలను గట్లు పైకి తెచ్చు కొని విడకొట్టి ఉప్పు ద్రావణం చళ్ళు కోవాలి. వర్షాలు తగ్గి తిరిగి ఎండ రాగానే పనలని తిరగేసి ఎండపెట్టాలి. కళ్ళం లో ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవ కుండా భద్రపరచుకోవాలి. నూర్చిన ధాన్యం 2-3 రోజులు ఎండ పెట్టడానికి వీలు లేక పోతే కుప్పలలో గింజ మొల కెత్తడమే కాకుండా రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించుకోవటానికి ఒక క్వింటా ధాన్యం కి ఒక కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తకుండ, చెడిపోకుండా నివారించవచ్చు .రంగు మారి తడిచిన ధాన్యం కంటే ఉప్పుడు బియ్యం గా అమ్ముకోటం వల్ల నష్టం కొంత వరకు నివారించ వచ్చు.పిగలు పొట్ట మరియు పూత దశ లో పైరు 1 నుండి 2 రోజులు కన్న ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తి గా బయటికి రకపోటం,పుష్పాలతో నీరు చేరటం వలన ఫలదీకరణ శక్తి కోల్పోతాయి. తాలు మరియు రంగు మారిన గింజలు ఏర్పడతాయి .గింజ రంగు మార కుండా ఉండటానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిం లేదా రెండు గ్రాముల కార్బండజిం + మంకోజెబ్ లేదా 1 మీ.లి ప్రాపికొణిజోలి మందు పిచికారి చేయాలి. పాలు పోసుకొనే దశ ఈ దశ లో 2 నుండి 3 రోజులు కన్న ఎక్కువ పంట నీట మునిగితే పిండి పదార్థాలు గింజ లో చేరక గింజ బరువు తగ్గి రంగు మారి తద్వారా దిగుబడి నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజం లేదా రెండు గ్రాముల కార్బండజం + మాన్కోజెబ్ లేదా 1 మీ.లి ప్రోపికొణిజోలు మందు పిచికారి చెయ్యాలని సూచించారు. (Story :రైతు సేవా కేంద్రం లో వడ్లు కొనుగోలు సేకరణ)