సుస్థిరాభివృద్ధిపై ముగిసిని శిక్షణ కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికంగా సాధించే లక్ష్యం తో ఎల్.ఎస్. డి. జి అంశాలపై వినుకొండ మండల పరిధిలో 16 వ తారీకు నుండి 19 వ తారీకు వరకు, 4 రోజులు రెండు బ్యాచ్ లు గా జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. తొలి బ్యాచ్ లో సర్పంచులు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, ఏఎన్ఎం లు రెండవ బ్యాచ్ లో మండల స్థాయి అధికారులు , ఇతర సచివాలయం సిబ్బంది మొత్తంగా 152 మంది శిక్షణలో పాల్గొనగా వారికి ఈఓ ( పి ఆర్ & ఆర్ డి ) సుoదరరెడ్డి ఆధ్వర్యంలో శిక్షకులు ( ఎం ఓ టి ) సుస్తిరాభివృద్ది లక్ష్యాలలో 17 కు గానూ 14 లక్ష్యాలు స్థానికం గా సాధించే విధానాలపై అవగాహన కల్పించారు. 9 రకాల థీమ్స్ గురించి సెషన్ల వారీగా శిక్షణ నిచ్చారు. ముగింపు సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. శిక్షణలో తెలుసుకున్న అంశాలను పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టాలని, స్థానికంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే సంక్షేమ మరియు ప్రగతి ఫలాలు క్షేత్రస్థాయి ప్రజానీకానికి అందటంతో బాటు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. (Story : సుస్థిరాభివృద్ధిపై ముగిసిని శిక్షణ కార్యక్రమం)