స్మార్ట్ మీటర్లపై సీపీఎం నిరసన
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, ట్రూ అప్ ఇంధన సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ వినుకొండ మండలం విట్టంరాజు పల్లి శాఖ కార్యదర్శి పెనుమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బ్రహ్మంగారి గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో వినుకొండ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లుల భారాలపై బాదుడే బాదుడు అన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు తన విద్యుత్ బాదుడును ప్రజలకు చూపిస్తున్నాడని విమర్శించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబమని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. స్మార్ట్ మీటర్లకు తాము వ్యతిరేకమంటూ నారా లోకేష్, రాష్ట్రవంతటా ప్రచారం చేశారని తాము అధికారంలోకి స్మార్ట్ ను రద్దు చేస్తామని, మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇంటింటికి మీటర్లు బిగిస్తుంటే నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తించడం నాయకులకు పరిపాటిగా మారిందని అన్నారు. కార్యక్రమంలో కే హనుమంత రెడ్డి, కే శివరామకృష్ణ, ఆర్ ముని వెంకటేశ్వర్లు, కేశవరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. (Story : స్మార్ట్ మీటర్లపై సీపీఎం నిరసన)