రహదారి ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ విజయనగరం రూరల్ పోలీసు స్టేషను సందర్శించి, స్టేషను పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూం, వివిధ నేరాల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – వివిధ కేసుల్లో సీజ్ చేసిన ప్రావర్టీ వివరాలను ప్రాపర్టీ రిజిష్టరు నందు నమోదు చేయాలని, అవసరం లేని వాహనాలను రిలీజ్ చేసి, యజమానులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణ, వినియోగం, విక్రయాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాతో సంబంధం ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలి పెట్టవద్దని, వారిని తప్పనిసరిగా కేసుల్లో నిందితులుగా చేర్చి, చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తులో ఉన్న చోరీ కేసులను ఛేదించే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా కేసుల్లో నిందితులను గుర్తించి, అరెస్టులు చేసి, చోరీ సొత్తును తిరిగి రికవరీ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణరు ప్రజల్లోను, యువతలోను చైతన్యం తీసుకొని వచ్చేందుకు ‘సంకల్పం’ కార్యక్రమాను చేపట్టి, అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. రహదారి ప్రమాదాలు తరుచూ జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలను నియంత్రించేందుకు కారణాలను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా రహదారులకు అవసరమైన ఇంజనీరింగు మార్పులు చేపట్టాలని, వాహనాలను వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్స్, స్పీడు బ్రేకర్లును ఏర్పాటు చేయాలని, బ్లాక్ స్పాట్స్ కు ఇరువైపుల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో నేరాలను నియంత్రించుటకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, అందుకు ఎం.ఎస్.పి.ల సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు తెలిపారు
అనంతరం, రూరల్ పీఎస్ పరిధిలో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసులు, పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై, వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూతగదాలు, గొడవలు, రాజకీయ పార్టీల నైరాలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల వివరాలు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించిన సమాచారం సేకరించి, ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతీ వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలని, ప్రజలకు సైబరు మోసాలు, డిజిటల్ అరెస్టు, మహిళల భద్రత, రహదారి భద్రతపట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎవరైనా సైబరు మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలీసు స్టేషనులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులు, వివిధ న్యాయ స్థానాల్లో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సిడీ ఫైల్స్ ను జిల్లా ఎస్సీ పరిశీలించి, కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేసారు. స్టేషను పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ఇన్ఫార్మర్ వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని, సమాచార సేకరణకు ఎం.ఎస్.పి.ల, దత్తత గ్రామ పోలీసుల సేవలను సమర్ధవంతంగా వినియోగించు కోవాలన్నారు. వివిధ స్టేషన్ రికార్డ్స్, జనరల్ డైరీ, పార్టు 1-5 రికార్డ్స్, హిస్టరీ షీట్స్, ప్రాసెస్ రిజిష్టరు, ఎఫ్.ఐ.ఆర్. ఇండెక్స్, కే.డి. చెక్ రిజిష్టరు, క్రైమ్ చార్జ్, క్రైమ్ ఆబ్స్ట్రాక్ట్, బీట్ బుక్స్ లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తనిఖీ చేసారు.అనంతరం, వృద్ధులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దుప్పట్లు, పండ్లు, వారి దిన చర్యలకు అవసరమయ్యే టూత్ బ్రష్, సబ్బులు, టూత్ పేస్టు, ఇతర వస్తువులను అందజేసారు. ఈ వార్షిక తనిఖీల్లో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, ఎస్ఐ అశోక్ కుమార్, ఎస్బి సిఐ ఎవి లీలారావు, ఇతర పోలీసు అధికారులు, ఎఎస్పీలు, దత్తత పోలీసులు పాల్గొన్నారు. (Story : రహదారి ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి)