డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు
మాజీ మంత్రి ఆహ్వానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాణిలక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 22.12.2024రోజు జరగనున్నాయి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారినీ ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వాన కమిటీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఆహ్వాన కమిటీకి అభినందనలు తెలిపారు. కమిటీ సభ్యులు శాలువాతో మాజీ మంత్రి గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు మాజీ జాయింట్ కలెక్టర్ చీర్ల.శ్రీనివాసులు,లెక్చరర్ గులాం హుస్సేన్,పి.పి కిరణ్ కుమార్ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ వాకిటి.శ్రీధర్,అఖిల పక్షం అధ్యక్షులు జి.సతీష్ యాదవ్,శ్రీని వాస్ రెడ్డి,ప్రభాకర్,బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నందిమల్ల.అశోక్,మాణిక్యం పాల్గొన్నారు. (Story : డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు మాజీ మంత్రి ఆహ్వానం)