మాదక ద్రవ్యాల పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
ఒకటో పట్టణ సీఐ ఎస్ శ్రీనివాస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం: మాదక ద్రవ్యాల పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఒకటో ఒకటి సిఐ ఎస్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని తోటపాలెం వద్ద పలు కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు సంకల్పం
అనే కార్యక్రమం ద్వారా
యువత కి మాదకద్రవ్యాలు అంటే ఏమిటి,మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా, సి ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలుశరీరంపై శారీరకంగా మానసికంగా.తీవ్రంగా ప్రభావం చూపించడం జరుగుతుందన్నారు . ప్రస్తుత యువత వాటికి జోలికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్ కలిగి ఉండడం, డ్రగ్స్ అమ్మడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అనంతరం విద్యార్థులకు సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు.కాలేజీ ఆవరణలో మాదకద్రవ్యాల సమాచారాన్ని పోలీసువారికి తెలపడానికి డ్రాప్ బాక్స్* ఏర్పాటు చేశారు. డ్రాప్ బాక్స్ ద్వారా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యతగా ఉంచడం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్ గణేష్ & సిబ్బంది పాల్గొన్నారు. (Story : మాదక ద్రవ్యాల పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి)