బాలికల గురుకుల పాఠశాలని సందర్శించిన ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘం నాయకులు
న్యూస్‌తెలుగు/చింతూరు : మండలంలోని స్థానిక గురుకులం పాఠశాలను సందర్శించారు సీపీఎం ప్రజా ప్రతినిధులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల మొత్తం అపరిశుభ్రంగా ఉందని అన్నారు.దారుణమైన పరిస్థితో విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారని వాపోయారు. చదువు రావడం పరిస్థితి అలా ఉంచితే అంటు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.ముఖ్యంగా బమరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉందని 705 విద్యార్థినిలకు12 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు.ఉన్న విద్యార్థులకు సరిపడా పారిశుధ్య సిబ్బంది, ఇతర సిబ్బంది లేక పోవడం దీనికి కారణం అని అన్నారు.కాలేజీ మరియు పాఠశాల విద్యార్థులు ఒకే చోట ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తిందని అన్నారు. కాలేజీ కట్టించి దానిని వినియోగించక పోవడం ఒక కారణం అన్నారు. 2 కోట్ల విలువైన కాలేజీ కట్టించి కనీసం మరుగు దొడ్లు నిర్మించ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంట్రాక్టులు గుత్తే దార్లలు అప్పగించి పర్యవేక్షణ లేకపోవడం ఒక కారణమని అన్నారు. ఆదివాశీల పిల్లలు చదువులకు ప్రభుత్వాలు అండనివ్వాలి ఇలా ఇబ్బంది పరిస్థితి తీసుకు రాకూడని అన్నారు. ఆర్.ఓ. ప్లాంటు ఉన్నా అది పని చేయక త్రాగడానికి లేదని అన్నారు.ఈ పరిస్థితి పై ప్రిన్సిపాల్ విజయలక్ష్మి వివరణ కోరగా తాను ఈ మధ్య కాలంలో ఇక్కడకు రావడం జరిగిందని తెలియజేసారు. సమస్యల పరిస్కారంపై చర్యలో భాగంగా మరమ్మతు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, ఎంపీటీసీ జయసుధ, సర్పంచ్ బొగ్గా వెంకమ్మ శంకర్, జిల్లా కమిటి సభ్యులు మేకల నాగేశ్వరావు,తాళ్లూరి శ్రీనివాసరావు, పాయం సత్యనారాయణ, బాబురావు,పొద్దయ్య, తదితరులు పాల్గొన్నారు. (Story : బాలికల గురుకుల పాఠశాలని సందర్శించిన ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘం నాయకులు)