ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులు పట్టివేత
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజల శ్రేయస్సే పరమావధిగా రోడ్డు ప్రమాదాలు లేని పట్టణంగా వినుకొండను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశం మేరకు వినుకొండ పట్టణంలో ప్రమాదాలకు కారణభూతంగా మారి వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తూ రోడ్డు మీద సంచరించు ఆవులను పట్టి సంరక్షించడం సెప్టెంబర్ 18వ తారీఖున వినుకొండ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ చేపట్టారు .నేటికీ సుమారుగా 72 ఆవులను బంధించి కనీస అపారధ రుసుముతో జరిమానా విధించి ఆవుల యజమానులకు తిరిగి అప్పగించడం జరిగింది. ఆవుల యజమానులు రాకుండ నేటికీ 14 ఆవులు మునిసిపల్ కార్యాలయం సంరక్షణలోనే గత 90 రోజులుగా ఉన్నాయి. వాటికి వెటర్నరీ వైద్యుడి చేత వైద్య పరీక్షలు నిర్వహించి చిలుకలూరిపేట లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం గోశాలకు శనివారం నాడు తరలించుటకు అన్ని ఏర్పాట్ల చేసినట్టు కమీషనర్ పేర్కొన్నారు. ఈ తరలింపు కార్యక్రమమును మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, మునిసిపల్ శానిటరీ ఇన్స్పెకర్ ఇస్మాయిల్, ఆధ్వర్యంలో నిర్వహించడమవుతుందని పేర్కొన్నారు. (Story : ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులు పట్టివేత)