మోతుగూడెం లో రక్తదాన శిబిరం
న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, మోతుగూడెం గ్రామంలో ఐ ఎన్ టి యు సి(327)యూనియన్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని చింతూరు సామాజిక ఆసుపత్రి సూపరిండెంట్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించారు. గ్రామంలోని ఏపీ జెన్కో ఉద్యోగస్తులు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని 62 యూనిట్ల రక్తం దానం చేశారని తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో రక్త నిధులలో రక్తం కొరత ఉందని, రక్తం కొరత తగ్గించేందుకు తమ వంతు బాధ్యతగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒకసారి రక్తదానం చేసిన వారు మూడు నెలల తర్వాత మళ్లీ చేయొచ్చని, చింతూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి తెలిపారు. రానున్న కాలంలో చింతూరు ఏజెన్సీలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. (Story : మోతుగూడెం లో రక్తదాన శిబిరం)