గంగినేని కి ఘన సన్మానం
న్యూస్ తెలుగు /వినుకొండ : కొత్తపేట 6వ వార్డు నందు వేంచేసి ఉన్న యున్న శ్రీ మహాగణపతి దేవాలయం ఆవరణలో శ్రీ అభయ విజ్ఞేశ్వర చారిటబుల్ సేవా ట్రస్టు ద్వారా సంకటహర చతుర్థి సందర్భంగా 108 కలశాలతో స్వామివారికి మహాభిషేకం జరిగింది .. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాలి శ్రీనివాసరావు, 6వ వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరావు, పులగం శ్రీనివాసరావు, ఒంగోలు హనుమంతరావు, వల్లంశెట్టి విశ్వనాథ్, కొత్త మాసు వెంకటనారాయణ, పులికొండ శ్రీనివాసరావు, సుతారం శ్రీను ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నూజెండ్ల మండల ఖమ్మంపాడు గ్రామానికి చెందిన గంగినేని రాఘవ, కు గ్రామస్తులు ఏకగ్రీవంగా నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను శ్రీ అభయ విజ్ఞేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ వారుఘనంగా దుశాలవ పూలమాలలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గంగినేని రాఘవ మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం, ప్రతి నెల జరిగే సంకటహర చతుర్థి కార్యక్రమానికి 5 నెలలపాటు ప్రసాద వితరణ స్వామివారికి సమర్పిస్తానని మహాగణపతికి మొక్కుకున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ రాఘవ, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల, శ్రీనివాసరావు, గోవిందయ్య, గుండా సుబ్బారావు, శని శెట్టి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. (Story : గంగినేని కి ఘన సన్మానం)