ప్రజా దర్బార్ కు మహా స్పందన
న్యూస్ తెలుగు/ వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి మహా స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీప్ విప్ వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రజా దర్బార్ అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి అంతా కుంటుపడి ప్రజా సమస్యలన్నీ పరిష్కారం కాలేదని, నేడు అవన్నీ పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నదని జివి అన్నారు. వైసిపి పాలనలో అంత రౌడీ పాలన జరిగి, వ్యవస్థలన్నీ కుంటుబడిపోయాయని, అవన్నీ గాడిలో పెట్టేందుకే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకో వలసి వస్తున్నది అన్నారు. వైసీపీ పాలనలో భూ దందాలు, భూ ఆక్రమణలు ప్రజల నుండి బలవంతంగా భూములు అంతా గంజాయి పాలన కొనసాగిందన్నారు. నేడు వాటన్నింటిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందన్నారు. నేటి ప్రభుత్వం ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా కృషి చేస్తున్నదని అన్నారు. వినుకొండ లో కూడా వైసిపి పాలనలో బలవంతంగా భూములు లాక్కోవడం, దౌర్జన్యాలు జరిగాయని నేడు వాటన్నిటికీ అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. మున్సిపాలిటీ ద్వారా ప్రతి ఒక్కరికి త్రాగునీరు సరఫరా చేసేందుకు అర్హులైన పేద కుటుంబాలన్నీ ఒక్కొక్కరు 200 మున్సిపాలిటీకి చెల్లిస్తే టాప్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు, ఆ 200 కూడా కట్టలేని పక్షంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ డబ్బు చెల్లించి పేద ప్రజలందరికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, టౌన్ సిఐ శోభన్ బాబు, టిడిపి నాయకులు పి.వి.సురేష్ బాబు, పి. అయూబ్ ఖాన్, చికెన్ బాబు, పి పూర్ణ పాల్గొన్నారు. (Story : ప్రజా దర్బార్ కు మహా స్పందన)