రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసింది
న్యూస్ తెలుగు/సాలూరు : రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 20 వేల రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజన్న దొర అన్నారు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా, కలెక్టర్ ఆఫీస్ వద్ద అన్నదాత కు అండగా వైస్సార్సీపీ ఉండగా అనే నినాదంతో గర్జించించిన పార్వతీపురం మన్యం జిల్లా వైస్సార్సీపీ నాయుకులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల ను ధగచేస్తుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ కింద 20000/- రూ, ఇస్తానన్న నగదు ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు.రాష్ట్రంలో నివసిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఉద్యోగస్థులు,MLA లు, ఎంపీ లు,మన అందరికి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్న రైతుకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మనకి అన్నం పెడుతున్న రైతు బిడ్డకి న్యాయం చేయటానికి వైస్సార్సీపీ ఇప్పుడు రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గిరిజన శాఖ మంత్రి పాముల శ్రీవాణి పార్వతిపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి వైయస్సార్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసింది )