డబుల్ బెడ్రూం కాలనీకి వీధిలైట్లు వితరణ
గొంది వెంకటరమణకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
న్యూస్ తెలుగు\వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీ ప్రధాన రోడ్డుకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. కాలనీలో నివాసం ఉంటున్న కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంది వెంకటరమణ స్పందించి 12 స్ట్రీట్ లైట్లు, సర్వీస్ వైరు వితరణ చేశారు. కాలనీ ప్రధాన రోడ్డుకు వీధిలైట్లు లేక చీకటిగా మారింది. ప్రతిరోజు రాత్రి సమయాల్లో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. పాములు, తేళ్ల భయంతో భయం గుప్పెట్లో ప్రజలు ఉన్నారు. దీంతో కాలనీవాసులు గొంది వెంకటరమణను కలిసి వీధిలైట్లు వితరణ చేయాలని కోరారు. స్పందించిన ఆయన వెంటనే వీధిలైట్లు కాలనీవాసులకు ఇప్పించేందుకు ఒప్పుకున్నారు. గురువారం కాలనీవాసులు కలిసి ప్రధాన రోడ్డుకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. మానవతా దృక్పథంతో వీధిలైట్లు ఇప్పించినందుకు కాలనీవాసులు గొంది వెంకటరమణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story : డబుల్ బెడ్రూం కాలనీకి వీధిలైట్లు వితరణ )