నూతన గృహ ప్రవేశం లో మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని విలేఖరుల కాలనీలో గృహప్రవేశం చేసిన మోహనాచారి సత్యవార్త విలేఖరి ఇంటికి విచ్చేసినా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విలేకర్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ డెవలప్మెంట్ కూడా తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో పాటు భోజనం చేశారు. పార్వతిమహేందర్ పిలుపు మేరకు షాప్ ఓపెనింగ్ లో పాల్గొని షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గురుస్వాములు ఎల్లయ్య బాలవర్ధన్ లు గఆదివారం పడిపూజ కార్యక్రమానికి రావాలని వారు కోరారు. ఆయన వెంట మండల టౌన్ అధ్యక్షులు వనం రాములు దిలీప్ రెడ్డి మున్సిపల్ చైర్మెన్ కరుణశ్రీ సాయినాథ్ వైస్ చైర్మెన్ కర్రెస్వామి సింగల్ విండో చైర్మెన్ జగన్నాధం నాయుడు కౌన్సిలర్లు ఎల్లారెడ్డి ఎల్లయ్య పార్వతి ముఖ్య నాయకులు పెద్దింటి వెంకటేష్ విశ్వరూపం శంకర్ నాయుడు , మధు సత్యం మూర్తి గోవిందునాయుడు శివ శంకర్ గౌడ్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన గృహ ప్రవేశం లో మాజీ మంత్రి )