జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న రహదారుల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలి
న్యూస్ తెలుగు\వనపర్తి : జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న రహదారుల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం జిల్లా కేంద్రంలో రహదారులు భవనాల శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కలెక్టర్ పరిశీలించారు.కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక చింతల హనుమాన్ దేవాలయం దగ్గర రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగాపెండింగ్ లో ఉన్న రోడ్డును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పానగల్ రోడ్డులో కూడా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్థానికంగా ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసి సంక్రాతి పండగలోపు వాడుకలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు కాంపౌండ్ వాల్ తోపాటు, ముందు ఉన్న కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మించి సిసి రోడ్డు కూడా వేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ కార్యనిర్వాహక ఇంజనీర్ దేశ్యా నాయక్, డిఈ సీతారామస్వామి, తాసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.(Story : జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న రహదారుల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలి )