వనపర్తి జిల్లాలో 2,366 పోలింగ్ కేంద్రాలు
న్యూస్ తెలుగు/వనపర్తి : గ్రామపంచాయతీ ఎన్నికల కోసం జిల్లాలో 2,366 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు తెలిపారు.పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల అంశంపై మంగళవారం జిల్లా స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 260 గ్రామ పంచాయతీలలోని 2,366 వార్డులకు గాను, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 2,366 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 200 లోపల ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 1,700 ఉన్నాయని, 201-400 మధ్య ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 652 ఉన్నాయని, 401 పైన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 14 ఉన్నాయని తెలిపారు.పోలింగ్ కేంద్రాల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపమని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. తదుపరి డిసెంబర్ 12వ తేదీన మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.(Story : వనపర్తి జిల్లాలో 2,366 పోలింగ్ కేంద్రాలు )