డంపింగ్ యాడ్ పరిశీలించిన మున్సిపల్ కమీషనర్
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక మార్కాపురం రోడ్ లోని పసుపులేరు బ్రిడ్జి నందు ఉన్న తాత్కాలిక డంప్సైట్ ను తరచూ పరిశీలించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ పట్టణ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ సోమవారం తనిఖీ చేపట్టీ, ప్రైవేట్ వ్యక్తులు మునిసిపల్ వాహనములను నిలువరించుటకు వేసిన అడ్డుకట్టను తొలిగించారు. పట్టణంలో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించామని, పారిశుధ్య విభాగాంకు ఉన్న సంక్లిష్టతలను గుర్తించి పుష్ కార్ట్స్ రిపేర్స్ డంప్ యార్డ్ ప్రక్షాళన పట్టణ శివార్ల పరిశుభ్రత మేజర్ డ్రైన్లలో డీసిల్టేషన్ ఆవుల, కుక్కల బెడదపై చర్యలకు ఉపక్రమించడం వంటి చర్యలు సంతృప్తి స్థాయిలో నిర్వహిస్తున్నామని, కానీ వినుకొండ మున్సిపాలిటీకి అధీకృతంగా శాశ్వితమైన డంప్ యార్డు స్థలం కేటాయించకపోవడం ప్రైవేట్ వ్యక్తులు డంప్ యార్డు స్థలంపై మునిసిపల్ కార్యాలయంనకు వచ్చి మెమోరాండం సమర్పించడం డంప్యార్డ్ వద్ద తరచూ ఆక్షేపణలు చేస్తూ మునిసిపల్ వాహనాలకు అడ్డుకట్టలు వేయడం పలుమార్లు డంప్యార్డ్ స్థలాలను మార్చడం వంటి డంప్ యార్డ్ సమస్యల నడుమ పట్టణ పారిశుధ్యం కొనసాగుతున్నదని శాశ్వత ప్రాతిపదికన మున్సిపాలిటీ డంప్యార్డ్ కొరకు స్థల సేకరణ నిమిత్తం ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు దృష్టికి తోసుకొనివెళ్తామని కమీషనర్ పేర్కొన్నారు. (Story : డంపింగ్ యాడ్ పరిశీలించిన మున్సిపల్ కమీషనర్)