ఉప్పరపాలెం గ్రామ ప్రజలకు త్రాగు నీరు ఇవ్వాలి
సిపిఐ డిమాండ్
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామ పేద ప్రజలకు మంచినీటి కుళాయిలు పైపుల ద్వారా వెంటనే పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలి. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కోరారు. సోమవారం నాడు మండలంలోని ఉప్పరపాలెం గ్రామానికి ఇంటి స్థలాల అర్జీలు పూర్తి చేయుటకు వెళ్లిన సిపిఐ నాయకులకు అచ్చటి పేద ప్రజలకు గత ప్రభుత్వం నుండి మంచినీరు అందుట లేదని త్రాగునీరు లేక బోరు బావులు నీరు వాడుతూ జబ్బుల పాలవుతున్నామని త్రాగునీటి కొరకు క్యానులలో నీరు 15 రూపాయలు పెట్టి కొనుక్కొని త్రాగుచున్నామని బోర్ వాటర్ వాడుకొనుచున్నామని వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు ఊరిలో మంచినీళ్ల పైపులు ఉన్నప్పటికీని పక్కనే కావలసినంత మంచినీటి చెరువు ఉన్నప్పటికీని గ్రామంలోని ప్రజలకు మంచినీరు అందించలేద ని ఇటీవల మంచినీరు వదిలే అసిస్టెంట్ గుమస్తా ను అడిగితే నాకు జీతం ఇవ్వట్లేదు కాబట్టి నేను నీరు వదలను అని బదులిచ్చాడని అచ్చటి పేద ప్రజలు సిపిఐ నాయకులకు చెప్పి వాపోయారు. అచ్చటికి చేరిన సిపిఐ నాయకులు మహిళలందరినీ సచివాలయం వద్దకు పిలిపించి మంచినీళ్ల కొరకు అర్జీ వ్రాయించి సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి సచివాలయ అధికారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నాగరికత చెందిన ప్రాంతాలలో గ్రామం పక్కనే చెరువు ఉండి నీరు అందించే అవకాశాలు ఉండి మంచినీరు కూడా అందించలేని గత వైసిపి ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. నేడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అధికారులు ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించి వెంటనే ఆ గ్రామానికి మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. తరువాత సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సచివాలయ అధికారులకు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకొనుటకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని అర్జీలు పెట్టుకున్న 300 మంది ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అర్జీలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాస రావు, సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము, పిన్ని బోయిన , కే మల్లికార్జునరావు, దుర్గమ్మ అరుణ కాశమ్మ పద్మ సుజాత రమణమ్మ తదితరులు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. (Story : ఉప్పరపాలెం గ్రామ ప్రజలకు త్రాగు నీరు ఇవ్వాలి)