విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ఒకటవ పట్టణ సి ఐ ఎస్ శ్రీనివాస్
న్యూస్ తెలుగు/ విజయనగరం : విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఒకటో పట్టణ సి ఐ ఎస్ శ్రీనివాస్ అన్నారు శనివారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు తోట పాలెం వద్ద గల శ్రీ చైతన్య కాలేజ్, కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులకు సంకల్పం అనే కార్యక్రమం ద్వారా యువత కి మాదకద్రవ్యాలు లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలు ఏమిటి,శరీరంపై శారీరకంగా మానసికంగా ఏ విధంగా వాటి ప్రభావం ఉంటుంది, వాటి జోలికి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రగ్స్ సేవించడం,డ్రగ్స్ ను కలిగి ఉండడం,
డ్రగ్స్ అమ్మడం వంటి చేయడము
వల్ల చట్టపరమైన చర్యలు గురించి,
వాటికి (అలవాటు) అయితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మాదకద్రవ్యాలు జోలికి వెళ్లకుండా ముందు జాగ్రత్తలు గురించి విద్యార్థులకు వివరించారు.
అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.కాలేజీ ఆవరణలో మాదకద్రవ్యాల సమాచారాన్ని పోలీసువారికి తెలపడానికి డ్రాప్ బాక్స్ఏర్పాటు చేశారు. డ్రాప్ బాక్స్ ద్వారా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యతగా ఉంచడం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్ గణేష్ , సిబ్బంది పాల్గొన్నారు.(Story : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి )