Home ఒపీనియన్‌ కలెక్టరేట్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును పరామర్శించిన మాజీ మంత్రి

కలెక్టరేట్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును పరామర్శించిన మాజీ మంత్రి

0

కలెక్టరేట్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును పరామర్శించిన మాజీ మంత్రి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఎదుట్లకు చెందిన నరెడ్ల. సాయిరెడ్డి అనే వ్యక్తి ఈ పాలనలో నాకు న్యాయం జరగడం లేదని దాయాదులు తన భూమి ఆక్రమించి ఇబ్బందులకు గురిచేయడం వల్ల ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగడం లేదని తీవ్ర ఆవేదన చెంది ప్రజావాణిలో కలెక్టర్ ఎదురుగా మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాస్పిటల్ కు వెళ్లి సాయి రెడ్డిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని ఓదార్చారు.వైద్యులను అతని ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు కరువైనాయని ఒకవైపు రైతు పండుగ సంబరాలు జరుగుతుంటే మరోవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.సాయిరెడ్డి న్యాయం కోసం పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగిన అధికార పార్టీ వారి ఒత్తిడులకు గురై పోలీసులు తనకు న్యాయం చేయకపోగా వేధించడం వల్ల,రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల భూమి పట్టా ఉన్నా సాగు చేయకుండా దాయాదులు దౌర్జన్యం చేయడం వల్ల విసిగి వేసారి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు అని ఇది దురదృష్టకరం అని అన్నారు. అధికారులు అధికార పార్టీ ఆదేశాలు రాష్ట్రపతి హుకూం లాగా పనిచేస్తున్నారని సివిల్ పంచాయితీలలో పోలీసులు కలగజేసుకోవడం వంటి చర్యలకు పాల్పడకుండా చట్టపరిదిలో పనిచేయాలని అన్నారు. జిల్లా మంత్రి కృష్ణారావు గారి సొంత గ్రామములో వేలాది క్వింటాల ధాన్యం మాయమైతే దిక్కులేదని అదేవిధంగా లక్షిమిపల్లిలో శ్రీధర్ రెడ్డి హత్య జరిగితే నేటికీ దోషులను పట్టుకోలేదు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం వంటి చర్యలకు మంత్రి చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఊరి ఊరికి షాడో ఎం.ఎల్. ఎలు తయారై ప్రజలను వేధించడం వల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం,అధికారులు స్పందించి సాయి రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆసుపత్రిలోని వార్డులో తిరిగి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ రెడ్డి వెంట పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,చిట్యాల.రాము, రవికుమార్, నాగేంద్రము తదితరులు ఉన్నారు.(Story : కలెక్టరేట్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును పరామర్శించిన మాజీ మంత్రి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version