అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చు
న్యూస్ తెలుగు/వనపర్తి : అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చునని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎయిడ్స్ అంటువ్యాధి కాదని బాధితులకు ధైర్యం నింపాలన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. వనపర్తి పట్టణంలోని గోపాల్పేట్ రోడ్ లో(mch) ప్రభుత్వ ప్రసూతి జర్నల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపి రిజిస్ట్రేషన్ కేంద్రం, ఫార్మసీ, ఆక్సిజన్ ప్లాంట్, లేబర్ రూమ్, (ప్రసూతి గది) నీయోనాటిల్ కేర్ కేంద్రాలను ప్రారంభించారు.ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్లకు సూచించారు.(Story : అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చు)