Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డిసెంబర్ 2 నుంచి కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ

డిసెంబర్ 2 నుంచి కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ

0

డిసెంబర్ 2 నుంచి కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ

వినుకొండలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన

న్యూస్ తెలుగు / వినుకొండ :  డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వస్తాయో రావో అన్నట్లుగా పింఛన్ల పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీన ఠంచనుగా ఇంటికే పింఛన్లు అందిస్తుమన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే 30వ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని, ఇలా నెలకు రూ.4 వేలు ఒకటో తేదీనే ఇంటికే పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని పేర్కొన్నారు. వినుకొండ రెండో వార్డు పరిధిలోని సీతయ్యనగర్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్మును అందజేశారు. అలాగే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి విచ్చేసి నగదు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ 65.20 లక్షలమందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఐదేళ్లు జగన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని, పింఛన్‌పై రూ.వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే వినుకొండ ముందుందని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 99 శాతం మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశామన్నారు. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తున్నామన్నారు. 2 నెలలు తీసుకోకపోతే ఆ తర్వాత నెలలో 3 నెలల డబ్బులను ఒకేసారి ఇవ్వనున్నామన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలను, పేదలను నిర్లక్ష్యం చేసినందుకే వైసీపీని ఇంటికి సాగనంపారన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు నిధులు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పాలనలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, అన్ని కార్పొరేషన్ల గౌరవం పెంచేందుకు నిధులు ఇస్తున్న సీఎం చంద్రబాబు, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నిర్వీర్యమైన వ్యవస్థలను సీఎం చంద్రబాబు చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు. అప్పులకుప్పగా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దదూ గాడిలో పెడుతున్నారన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చటానికి సీఎం చంద్రబాబు రూ.వెయ్యి కోట్ల నిధులు ఇచ్చారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని పునఃనిర్మిస్తున్నామని, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లేకేష్ సీఎం చంద్రబాబుకు కుడిభుజంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నామని, నూతన సంవత్సరంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు కూడా ఇవ్వబోతున్నామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఒకానొక సందర్భంలో వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఎలా ఇస్తారని అనుకున్న సమయంలో ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే వినుకొండకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నేతృత్వంలో బ్రహ్మాండంగా నిధులు వరద వస్తోందని, దీనికి తానే ప్రత్యక్ష సాక్షిని అని తెలిపారు. రామలింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 కోట్లు, తితిదే కల్యాణ మండపానికి రూ.3 కోట్లు, షాదీఖానాకు రూ.3.5 కోట్లు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నుంచి రూ.2 కోట్లు తీసుకొచ్చారన్నారు. నిధులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ జీవీ ఆంజనేయులు తనకున్న పరిచయాల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకొస్తున్నారని కొనియాడారు. (Story : డిసెంబర్ 2 నుంచి కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version