రైతు సదస్సులో స్టాల్స్ ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాల సందర్బంగా గురువారం ఏర్పాటుచేసిన రైతు సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రాష్ట్ర ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ , జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గార్లతో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రైతు సదస్సులో పలు కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ల ద్వారా అన్నదాతలకు, మహిళా సంఘం సభ్యులకు, నిరుద్యోగ యువతకు, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకునే వారికి తగిన ప్రోత్సాహకం అందిస్తారని ఆసక్తి గలవారు స్టాల్స్ ను సందర్శించి వారి వారి వివరాలను నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులు, వివిధ కంపెనీల యాజమాన్యం, బ్యాంకుల అధికారులు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.(Story : రైతు సదస్సులో స్టాల్స్ ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి)