పూలే కి నివాళి
న్యూస్ తెలుగు సాలూరు : ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పూలమాల వేసి నివాళులు అర్పించారు.తన నివాసం లో జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు వైసిపి నాయకులు పూలే కి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ శతాబ్దంలో ప్రజల్లో సామాజిక చైతన్యం నింపిన గొప్ప సంస్కర్త అని చెప్పారు.మహిళా అక్షరాస్యత ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించిన మహనీయుడని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రెడ్డి సురేష్,పట్టణ జెసి ఎస్ కన్వీనర్ గిరిరఘు, పట్టణ నాయకులు హరి బాలాజీ,పిరిడి రామకృష్ణ,ఎం.అప్పారావు పాల్గొన్నారు . (Story : పూలే కి నివాళి )