సృజనాత్మకతను వెలికితీసేందుకే చెకుముకి టాలెంట్ టెస్టులు
న్యూస్ తెలుగు/వనపర్తి : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే జన విజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్టులు దోహదపడతాయని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో చెకుముకి సంబరాలు 2024 కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చెకుముకి సంబరాలు 2024 క్వశ్చన్ బుక్ లెట్ ను ఆవిష్కరించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో జన విజ్ఞాన వేదిక ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : సృజనాత్మకతను వెలికితీసేందుకే చెకుముకి టాలెంట్ టెస్టులు)