UA-35385725-1 UA-35385725-1

పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మారుమూల పల్లెలను సైతం అభివృద్ధి పదంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 12250 కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని, వనపర్తి నియోజకవర్గంలో సైతం 12 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు మొదలైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో మంగళవారం ఆయన నూతన గ్రామపంచాయతీ భవణ నిర్మాణానికి, అంగన్వాడి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిందని గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలను, నూతన అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణాలను, పొలం బాటలను, రైతులకు వ్యవసాయోగ్యమైన పాంపాండ్స్, వర్మి కంపోస్ట్ ఫిట్ నిర్మాణాలను గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణాలను, నర్సరీ అభివృద్ధిని, చెక్ డ్యామ్ ల నిర్మాణం గల్లి కంట్రోల్ వాల్సు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ అభివృద్ధి పనులు రైతులకు గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగంపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈ ఈ మల్లయ్య, DRDA PD ఉమాదేవి, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ పెద్దమందడి ఎంపీడీవో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1