సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం భారత రాజ్యాంగం లక్ష్యం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమని కలెక్టరేట్ ఏఓ భాను ప్రకాష్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా అధికారులు, సిబ్బంది చేత భారత రాజ్యాంగం పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగానికి నవంబర్ 26, 1949న చట్ట సభల్లో ఆమోదం లభించిన నేపథ్యంలో ఏఓ భాను ప్రకాష్ రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం భారత రాజ్యాంగం లక్ష్యం)