వినుకొండలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాజ్యాంగ దిన వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం వినుకొండ పట్టణంలో విద్యార్థినీ విద్యార్థులతో భారీ ర్యాలీ పుర ప్రజలను ఆకట్టుకున్నది. భావి భారత పౌరులం, రాజ్యాంగ రక్షకులం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగాన్ని ఆచరిద్దాం అంటూ విద్యార్థులు ర్యాలీ సురేష్ మాల్ రోడ్డు నుండి మొదలై పల్నాడు రోడ్డు శివయ్య స్తూపం సెంటర్ మీదుగా పెట్రోల్ బంకు వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి అలాగే నరసరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సురేష్ మహల్ రోడ్డు కోర్టు వద్ద రాజ్యాంగ పీఠికను అమలు చేస్తామని బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ జుజ్జూరి ఐరామ్మూర్తి, స్థానిక న్యాయవాదులు పీజే లూకా, విజయ్, దుగ్గిపోగు సామాజిక కార్యకర్త సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు నాయకులు వీ. రమాచారి రామయ్య, అమరతపూడి ఎస్ రవికుమార్, కార్యక్రమంలో పాల్గొని ర్యాలీకి నాయకత్వం వహించారు. అనంతరం వినుకొండ గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పట్టణంలోని బాలికలు ఉన్నత పాఠశాలలో మరియు గీతం బ్లూమ్స్ పాఠశాలల్లో సభలు నిర్వహించి రాజ్యాంగ దినోత్సవం సందర్భాన్ని మరియు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. (Story : వినుకొండలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు)