UA-35385725-1 UA-35385725-1

కూటమి ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లుచేయాలి

కూటమి ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లుచేయాలి

న్యూస్ తెలుగు /వినుకొండ : కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన మాటను వెంటనే అమలు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం వినుకొండలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆవరణలో ఉన్న సచివాలయం వద్ద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ. గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్నాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయా ఇళ్ల స్థలాల్లో పట్నాలకు దూరంగా నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపలేదు. ప్రభుత్వం ఇచ్చే సెంట్ స్థలం నివాసయోగ్యానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతార్ చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సుముకుత చూపులేదు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 మాత్రమే ప్రకటించారు. ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని పేదలు ఎవరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పట్టాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్నాల్లో రెండు సీట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అదే విధంగా హామీ ఇస్తూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేద వాళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇంటి స్థలం కేటాయింపు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమే. సిమెంటు, ఇసుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని పేదల ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక ,కంకర ప్రభుత్వమే ఉచితంగా కల్పించలి. ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్నాల్లో గ్రామాల్లో నివాసయోగ్యంగా గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలి.

గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన లేఔట్లను మార్పు చేసి పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్నాల్లో రెండు సీట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలి. రోడ్లు, విద్యుత్ ,తాగునీరు, డ్రైనేజీ, పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏ మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. గత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో టిట్కో ఇళ్ళు కొంతవరకు నిర్మించి ఎన్నికల రావటంతో అవి పూర్తి చేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిట్కో గృహాలను నిర్వీర్యం చేసి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు మరల కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో గృహాలబ్ధిదారులందరూ కూడా గృహాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి టిట్కో గృహాలను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు”. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పటాన్ లాల్ ఖాన్, బూదాల చిన్న, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కిషోర్, కొప్పెరపు మల్లికార్జున, రాయబారం వందనం, పొట్లూరు వెంకటేశ్వర్లు, ఎస్. కె మస్తాన్, జెల్లీ వెంకటేశ్వర్లు, మల్లికా, గౌసియా, పద్మ, దుర్గా, మస్తాన్బి, సుభాని, దండిపోయిన అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినుకొండ మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. (Story : కూటమి ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లుచేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1