ఎల్ఐసికార్యాలయంలో ఏజెంట్లు సమావేశం
న్యూస్ తెలుగు / వినుకొండ : ఎల్ఐసిలో పాలసీదారులకు, ఏజెంట్లకు వ్యతిరేకంగా వస్తున్న మార్పులపై ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసిఏఓఐ) ఏజెంట్స్ యూనియన్ దశలవారి పోరాటాలను సాగిస్తుందని ఏఓఐ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో సోమవారం ఏవో ఏజెంట్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐఆర్డిఏఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ని నీరు గారు వస్తుందని ఆరోపించారు. పాలసీదారుల బోనస్ తగ్గించడం తోపాటు జీఎస్టీని వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏజెంట్ల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా సంస్కరణ తీసుకువస్తున్నారని ఆరోపించారు. పాలసీదారులు భీమా తీసుకునే వయస్సును 50 సంవత్సరాలు తగ్గించడం, మినిమం పాలసీని లక్ష నుండి రెండు లక్షలకు పెంచడం వల్ల వారు సంస్థకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ప్రయోజనాలను కాపాడాలని, పాలసీదారులకు లబ్ధి చేకూర్చాలని ఏఓఐ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈనెల 21న మచిలీపట్నం డివిజన్ కార్యాలయ వద్ద ధర్నా, ఫిబ్రవరి 11న చలో ఢిల్లీ, కోటి సంతకాల సేకరణ, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏజెంట్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏవోయి సీనియర్ నాయకులు సన్నెగంటి కోటేశ్వరరావు, బ్రాంచ్ కార్యదర్శి అంబటి ఐరామమూర్తి, ట్రెజరర్ నరసింహారావు, గల్లా సీతారామయ్య, రవయ్య, బ్రహ్మయ్య, రాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : ఎల్ఐసికార్యాలయంలో ఏజెంట్లు సమావేశం)