UA-35385725-1 UA-35385725-1

సామాన్యులే సెలబ్రిటీలుగా “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ లాంఛ్ 

సామాన్యులే సెలబ్రిటీలుగా “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ లాంఛ్ 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :  ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ ను సామాన్యులే సెలబ్రిటీలుగా ఆటో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, మోటార్ మెకానిక్, వెయిటర్, కూలీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. ప్రేక్షకుల మనసుల్ని కదిలించే చిత్రమిది. చిన్న సినిమా ఓటీటీలో, పెద్ద సినిమా థియేటర్స్ లో చూడాలని అనుకుంటారు కానీ మా “డ్రింకర్ సాయి” సినిమా థియేటర్స్ లో బెస్ట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. త్వరలోనే “డ్రింకర్ సాయి” సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

నిర్మాత బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ – అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ మూవీ “డ్రింకర్ సాయి”. ధర్మ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మీరు టీజర్ లో చూసింది కొంతే. సినిమాలో ఇంకా చాలా కంటెంట్ ఉంది. మీ అందరి సపోర్ట్ మా “డ్రింకర్ సాయి” సినిమా దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి, నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని బిలీవ్ చేసిన డైరెక్టర్ కిరణ్ గారికి థ్యాంక్స్. ఇలాంటి మంచి మూవీతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం సంతోషంగా ఉంది. “డ్రింకర్ సాయి” మంచి లవ్ స్టోరీతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. షూటింగ్ టైమ్ లో హీరో ధర్మ ఎంతో సపోర్ట్ అందించారు. టీమ్ అందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నటుడు అంబర్ పేట శంకర్ మాట్లాడుతూ – నాకు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి. చాలా మంది దర్శకులు, నిర్మాతలు నన్ను తమ సినిమాల్లో నటించమని అడిగారు. రామ్ గోపాల్ వర్మ కూడా క్యారెక్టర్ ఆఫర్ చేశారు. నేను నటించను అని చెప్పాను. కానీ నా తమ్ముడు ధర్మ, నా ఫ్రెండ్, ఈ సినిమా ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ అడగగానే “డ్రింకర్ సాయి” సినిమాలో నటించాను. ఈ సినిమా మీ అందరికీ కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. అన్నారు.

నటి కిర్రాక్ సీత మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాలో కీలక పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. టీజర్ చూసి సినిమాపై ఒపీనియన్ కు రాకండి. ఈ సినిమాలో ఎన్నో బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా ఆద్యంతం మీరు ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్ లో తప్పకుండా “డ్రింకర్ సాయి” చూడండి. అన్నారు.

హీరో ధర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ ను మర్చిపోలేను. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కిరణ్ గారికి, మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్, ఇస్మాయిల్, లహరిధర్ గారికి థ్యాంక్స్. మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్లే ఇక్కడిదాకా రాగలిగాను. అలాగే శంకర్ అన్న మా మూవీకి ఎంతో సపోర్ట్ అందించారు. ఆయన సినిమాలో ఓ మంచి రోల్ కూడా చేశారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ ను ఎప్పుడు మర్చిపోలేము. “డ్రింకర్ సాయి” చూసి మీరు ఇది యూత్ ను చెడగొట్టే సినిమా అనుకోకండి. మంచి లవ్ స్టోరీ ఉంది, అలాగే మీకు నచ్చే ఎన్నో ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి. అన్నారు.

దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ – సాయి అనే పేరున్న యువకుడు దాదాపు ఇంటికొకరు ఉంటారు. మన సినిమాలో హీరో ఎక్స్ ప్రెస్ లా తాగుతుంటాడు అందుకే మూవీకి “డ్రింకర్ సాయి” అనే పేరు పెట్టాం. టీజర్ చూసి ఇబ్బందికరంగా కొన్ని మాటలు ఉన్నాయి అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే అవి మన రియల్ లైఫ్ లో మాట్లాడుకునే మాటలే. టీజర్ చూసి నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిన వారు థియేటర్ లో సినిమా చూస్తే మంచి సినిమా చేశాడని దర్శకుడిగా నన్ను ప్రశంసిస్తారు. ఈ మాట నమ్మకంతో చెప్పగలను. థియేటర్ లో “డ్రింకర్ సాయి” సినిమా చూడండి, మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

“డ్రింకర్ సాయి” సినిమా టీజర్ యూత్ ఫుల్, లవ్ అండ్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో సాగింది. హీరోయిన్ కు హీరో చేసే మాస్ లవ్ ప్రపోజల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. తన క్యారెక్టర్ లోని అన్ని ఎమోషన్స్ ను పర్పెక్ట్ పర్ ఫార్మ్ చేశారు హీరో ధర్మ. హీరోయిన్ ఐశ్వర్య సెటిల్డ్ గా నటించింది. పోసాని, సమీర్, భద్రం వంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు కీ రోల్స్ చేస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీగా “డ్రింకర్ సాయి” సినిమా ఉండబోతున్నట్ల టీజర్ రివీల్ చేస్తోంది.

నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
ఎస్ఎఫ్ఎక్స్ – రఘు
వీఎఫ్ఎక్స్ – సుమరం రెడ్డి
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి (Story : సామాన్యులే సెలబ్రిటీలుగా “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ లాంఛ్ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1