ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాట ఫలితంగా
ఊడిజర్ల వరి రైతుల సమస్య పరిష్కారం ఆనందం వ్యక్తం చేసిన రైతులు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈనెల మూడవ తేదీ న మొదలైన ఈ ఉద్యమం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఏమాత్రము వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని నడపడం జరిగిందని రాము ఒక ప్రకటనలో తెలిపారు.. అయితే ఇందులో అభినందించాల్సిన వ్యక్తులు కొందరున్నారు. వారిలో పల్నాడుజిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, ఈపూరు మండలం వ్యవసాయ శాఖ అధికారి రామారావు రైతులకు అండగా నిలిచారు. వారి చొరవతో విత్తనాల కంపెనీ ప్రతినిధి గోపాలకృష్ణ మన రైతు సంఘంతో రైతులతో ఈపూరు ఏవో ఆఫీసులో ఈ నెల 11 వ తేదీన సంప్రదింపులు జరిపారు. వారు చెప్పిన ప్రతిపాదన రైతులు చెప్పిన ప్రతిపాదన రెండిటిని మన రైతు సంఘం సమన్వయం చేసి శనివారం వినుకొండ ఏవో ఆఫీసులో మరొకసారి రైతులతో వ్యవసాయ అధికారి రామారావు, విత్తనాల కంపెనీ ప్రతినిధి గోపాలకృష్ణ, విత్తనాల షాపు యజమాని మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము సుమారు రెండు గంటలసేపు చర్చించి రైతులకు ఆమోదయోగమైన పరిష్కారాన్ని చేయడం జరిగింది. 15 రోజులు కూడాగడవకుండానే 250 ఎకరాల సమస్య పరిష్కరించిన ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని చెప్పుకోవడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 15 సంవత్సరాలుగా రైతంగం కోసం చేసిన ఉద్యమాలన్నీ విజయవంతం అయ్యాయని రాము ఈ సందర్భంగాతెలిపారు. చేపట్టిన అన్ని సమస్యలు పరిష్కరించటం జరిగిందన్నారు. ఈ గ్రామంలోనే మన సంఘం రెండో విజయం సాధించింది. ఇకపై కూడా చిత్త శుద్ధితో మన సంఘం పల్నాడు జిల్లాలో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం ఆయన వెంటనే రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని రైతులు అభినందించారు. నిజంగా రైతుల కోసం పనిచేసే సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని పలువురు కొని ఆడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మరొకసారి పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి కి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి వెనిగళ్ళ బాలాజీఅధ్యక్షత వహించారు. వీరితోపాటు అంజిరెడ్డి, సాయిరెడ్డి, కొండల్ రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లచ్చిరెడ్డి మరియు 70 మంది రైతులు పాల్గొన్నారు.(Story:ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాట ఫలితంగా)