పారా మెడికల్ కోర్సులలో అడ్మిషన్లు
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్
న్యూస్ తెలుగు/కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సులలో అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో పారా మెడికల్ కోర్సులైన డి.ఎం.ఎల్.టి.లో 30 సీట్లు, డి.ఎం.సి.జి.లో 30 సీట్లు ఉన్నాయని, ఇంటర్మీడియట్‌లో బి.పి.సి. పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఎం.పి.సి. గ్రూపుల వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 25న ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, డిసెంబర్ 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ధ్రువపత్రాలు, బోనఫైడ్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫోటో దరఖాస్తు ఫారంతో దరఖాస్తు చేసుకోవాలని, 100 రూపాయల రుసుము చెల్లించాలని తెలిపారు. దరఖాస్తు ఫారం ను ఆన్ లైన్ లో https://tgpmb.telangana.gov.in పొందవచ్చని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.(Story : పారా మెడికల్ కోర్సులలో అడ్మిషన్లు )