వినుకొండలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంధాల సంస్థ వారి ఆదేశాల మేరకు వినుకొండ శాఖ గ్రంధాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం మూడవరోజు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్. ఎస్. ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య మొదలైన వారిని స్మరించుట వినుకొండ శాఖ గ్రంధాలయ అధికారి భూక్య బద్రి నాయక్ మాట్లాడుతూ. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న అయ్యంకి వెంకట రామయ్య గ్రంధాల ఉద్యమకారుడు అని 1911లో విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ స్థాపనకు తోడ్పడ్డాడు, 1915లో గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జనరల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. అయ్యంకి వెంకట రమణయ్య సంఘాన్ని స్థాపించిన రోజున నేషనల్ లైబ్రరీ డే గా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి ఆరోజు నుండి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని గ్రంథాలయాధికారి భూక్య బద్రి నాయక్ తెలిపారు. (Story : వినుకొండలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు)