Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు

పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు

0

పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పై చేసిన అనుచిత, అవహేళన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పటాన్ అయూబ్ ఖాన్ గురువారం వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శోభన్ బాబుకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి టీవీ5 ఛానల్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా బిఆర్ నాయుడు పై వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడడం, టీవీ5 కుక్క, సన్యాసి అని అనుచితంగా దూషించడం అమానుషమని పేర్కొన్నారు. ఈనెల 12న సాక్షి మీడియా లైవ్ ప్రసారం ద్వారా పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని, తిరుమల తిరుపతి దేవస్థానం, టీవీ5 పై నిందిస్తూ మాట్లాడడం మీడియా ద్వారా ప్రసారమై మరింత వ్యాప్తి చెంది నిరాధారమైన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయఅన్నారు. పోసాని కృష్ణ మురళి చేసిన అనుచితమైన వ్యాఖ్యలు టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు బి.ఆర్ నాయుడు ప్రతిష్టతను మంటగట్టే విధంగా ఉన్నాయని, దీన్ని పరిగణంలో తీసుకొని నిందితుడు పోసాని కృష్ణ మురళి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయూబ్ ఖాన్ ఫిర్యాదుల పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు సౌదాగర్ జానీ బాషా,గట్టుపల్లి శ్రీనివాసరావు, పి.వి. సురేష్ బాబు,పువ్వాడ కృష్ణ,అజీజు ,పొట్లపాటి సాహెబా,వీరగంధం ప్రశాంత , కంచుమటి తీరూపాలు , పూనడల నరసింహారావ్ , సాయిబాతదితరులు ఉన్నారు.(Story:పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version