పుట్టిన బిడ్డకు సమయానుసారంగా ఇవ్వాల్సిన టీకాలు అన్ని వేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి
కనీస వ్యాయామం పరిమిత భోజనం, ముందస్తు జాగ్రత్తలు పాటించి మధుమేహం వ్యాధి రాకుండా రక్షణ పొందాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్ తెలుగు/వనపర్తి : నవంబర్ 14న పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవం అదే రోజు ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నర్సింగాయ పల్లి వద్ద ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య, జిల్లా సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించిన కార్యక్రమానికి కలక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పుట్టిన పిల్లలకు టీకాలు ఎంత అవసరం, వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి అనర్థాలు వస్తాయి అనేది వైద్య కళాశాల విద్యార్థులు చిన్న నాటిక ద్వారా అక్కడ వచ్చిన పిల్లల తల్లులకు వివరించారు. చిన్న పిల్లల ద్వారా కలక్టర్ కేక్ కట్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలక్టర్ మాట్లాడుతూ నేడు భారత దేశం పోలియో రహిత దేశంగా అవతరించినందుకు ప్రతి ఒక్కరం గర్వంగా చెప్పుకుంటున్నామని అందుకు ప్రధాన కారణం పోలియో చుక్కల కార్యక్రమాన్ని దేశంలో విజయవంతం చేయడమే అని అన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మమ్మ, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, రాంచందర్ రావు, పరిమళ, మెడికల్ ఆఫీసర్, వైద్యులు , పిల్లలు తదితరులు పాల్గొన్నారు.(Story:పుట్టిన బిడ్డకు సమయానుసారంగా ఇవ్వాల్సిన టీకాలు అన్ని వేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి)