డ్రగ్స్ కు యువత బానిస కాకూడదు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : భారత ప్రభుత్వం యువజన సర్వీసులు & క్రీడల మంత్రిత్వ శాఖ వారి నెహ్రుయువ కేంద్రం & మై భారత్ మరియు నిస్వార్ద అర్గనైజేషన్ అద్వర్యంలో వనపర్తి ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాలలో నిర్వహించిన డ్రగ్ నిర్మూలన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వనపర్తి జిల్లా SP .రావుల గిరిధర్ రావు IPS పాల్గొన్నారు. వివేకానంద చిత్రపటానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాలు మరియు శిక్షలు .మత్తు పదార్థాల వాడటం వల్ల సమాజం లో కుటుంబాలలో కలహాలు .సమాజం పై చెడు ప్రభావం చూపుతాయని తెలిపారు.విద్యార్థులతో మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ప్రతిజ్ఞా చేయించారు.ఈ కార్యక్రమంలో అభ్కారి శాఖ CI వెంకట్ రెడ్డి . NYKS జిల్లాయువజన అధికారి V. కోటా నాయక్ .SI సునిత. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే. ఉమ. అధ్యాపకులు ధాంసింగ్. వెంకట్ రెడ్డి .చంద్రశేకర్ రెడ్డి . సునీత .రాఘవేంద్ర. నాగలక్ష్మి. మరియు నిస్వార్ద అర్గనైజేషన్ వ్యవస్థాపకులు అరవింద్. సభ్యులు శరత్..కళ్యాణ్.కార్తీక్.మహేష్.ప్రవీణ్.భీమేశ్వర్.పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. (Story : డ్రగ్స్ కు యువత బానిస కాకూడదు)